హైదరాబాద్ : హస్తినాపురంలోని పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న ఏఎస్‌వో నరేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏఎస్‌వో ఇంట్లో నుంచి రూ. 79 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని నరేందర్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.




