Tuesday, 3 November 2026

టీపీసీసీ చీఫ్‌ పొన్నాలపై పాల్వాయి ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోయినా సిగ్గులేకుండా పొన్నాల పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సమర్థతలేని వారికి బాధ్యత ఇస్తే కాంగ్రెస్‌ ఎలా మనగలుగుతుందని ప్రశ్నించిన ఆయన పార్టీ పగ్గాలు యువతకు అప్పజెప్పాలన్నారు. పొన్నాల అసమర్థత వల్లే సభ్యత్వ నమోదు ఇంకా ప్రారంభంకాలేదన్నారు. కాంగ్రెస్‌ నుంచి వలసలు కొనసాగుతుంటే పార్టీ నేతలనే సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సబబన్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీపై హైకమాండ్‌ దృష్టిసారిస్తుందని పాల్వాయి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *