భద్రాచలం పట్టణం: భద్రాచలం మండలం కొత్తూరు నారాయణపురం చెరువులో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. భద్రాచలం పట్టణంలోని జగదీశ్ కాలనీకి చెందిన సారిక(18), అఖిల(14)లు బతుకమ్మ పూల సేకరణ కోసం వెళ్లారు. కలువ పూల కోసం చెరువులోకి దిగి నీటమునిగి మృతిచెందారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరికొని పరిశీలించారు. గజ ఈతగాళ్ల సహాయంతో సారిక మృతదేహం వెలికితీశారు. అఖిల మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.




