Monday, 2 November 2026

జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష

6fx5o83f
* అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడి-
బెంగళూరు : తమిళనాడు సీఎం జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. శిక్ష ఖరారుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. జయ అనారోగ్యంతో బాదపడుతున్నదని, శిక్షను సంవత్సరానికి తగ్గించాలని జయతరపు న్యాయవాది కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా… తనకు బెయిలు మంజూరు చేయాల్సిందిగా జయ దరఖాస్తున్నట్లు తెలుస్తోంది.* జయ దోషి
* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టు

బెంగళూరు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేసును విచారించిన బెంగళూరు కోర్టు ఆమెను దోషిగా నిర్దారించింది. ఈ కేసులో నేరం రుజువైనట్లు కోర్టు ప్రకటించింది. మధ్యాహ్నం తర్వాత శిక్షను ఖరారు కానుంది. రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న జయ ఇక జైలులో అడుగుపెట్టనుంది.

ఈ కేసు విచారణ 18 ఏళ్లుగా కొనసాగిన అనంతరం ఇవాళ తుది తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించింది. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి. జయలలిత ఆస్తుల కేసులో గత 18 ఏళ్ల నుంచి మొత్తం 358 మందిని కోర్టు విచారించింది. ఈ కేసులో జయతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, దత్త పుత్రుడు సుధాకరణ్, ఇళవరసుకు కూడా శిక్ష పడనుంది.

2004 వరకు చెన్నైలోనే జయ కేసు విచారణ జరిగింది. అయితే జయ అధికారంలోకి రావడంతో ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఆనాడు జయ నివాసంలో ఏసీబీ జరిపిన దాడుల్లో 28 కిలోల బంగారం, 880 కిలోల వెండి, 10 వేల పట్టుచీరలు, 90 గడియారాలు, ఖరీదైన కార్లు, 780 చెప్పుల జతలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు నెలకు ఒక రూపాయి జీతం తీసుకున్న ఆమె రూ. 66 కోట్లు ఎలా సంపాదించారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఇందుకు ప్రతిస్పందించిన జయ.. ఒక సినీ నటిగా సంపాదించానని, అక్రమాలకు పాల్పడలేదని ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణలో భాగంగా జయను చెన్నై న్యాయస్థానం 1,300 ప్రశ్నలను అడిగింది.

తమిళనాడు రాష్ట్ర చరిత్రలో జయలలితది ప్రత్యేక స్థానం. సినీ రంగంలో జయకు ఎవరూ సాటిరారు. తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రిగా జయ పగ్గాలు చేపట్టడం విశేషం. 43వ ఏటనే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జయ.

జయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు
అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు సీఎం జయలలిత జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొది. ఎన్నో ఉత్తాన పతనాలను చవిచూసింది. అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోనూ ఆమెకు ఎన్నో కష్టనష్టాలు ఎదురయ్యయి. అన్నింటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కంటూ
ఆమెకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఓ సాధారణ సినిమా హీరోయిన్ స్థాయి నుంచి తమిళనాడు సీఎంగా ఎదిగారు. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టింది.

1977లో ఎంజీ రామ్చంద్రన్ తమిళనాడుకు మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. 1984లో జయ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు.

1987లో రామచంద్రన్ మరణించడంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు జానకికి మద్దతు ప్రకటించడంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ మె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.

1989లో బొడినాయకన్నూర్ నుంచి ఏఐఏడీఎంకే తరపున జయ శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. సభలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఎన్నికలకు ముందు తమిళనాడులో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరగింది. ఆ సానుభూతి దేశమంత పనిచేసి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. అప్పటి ఎన్నికల్లో తమిళనాట ఏఐడీఎంకే మొత్తం 234 స్థానాలకు 225 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడుకు జయ మొట్టమొదటి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే ఎడాది ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఏఐడీఎంకే కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో కరుణానిధి పార్టీ డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కరుణానిధి జయ అక్రమాస్తుల కేసుపై దృష్టి పెట్టారు. అమెపై దాదాపు 9 కేసులు నమోదయ్యయి. ఇందులో ఏడు కేసుల నుంచి జయ నిర్దోషిగా బయట్టారు. కలర్ టీవీల కుంభకోణం కూడా చెప్పుకోదగ్గదే.

2001లో మళ్లీ జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకుని… ఆ స్థానంలో మంత్రివర్గంలోని పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించింది. అనంతరం 2006లో మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2011లో ముచ్చటగా మూడో సారి జయ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల వారి మనసులు చోరగోనేందుకు ‘అమ్మ’ పేరిట పలు సంక్షేమ పథకాలు చేపట్టింది. ప్రభుత్వంలో ఉండి కేసును ప్రభావితం చేస్తారని అక్రమాస్తుల కేసును బెంగళూరు కోర్టకు బదిలి చేశారు. సీఎం హోదాలో ఆమె బెంగళూరు కోర్టుకు విచారణకు హాజరయ్యరు. తన ఆస్తులు అక్రమంగా సంపాదించిన కావని, తన తల్లితో పాటు తాను చాలాకాలం సినిమా హీరోయిన్లుగా పనిచేశామని, కొన్ని ఆస్తులు తన పూర్వికులనుంచి వచ్చినవని, మరికొన్ని తాను హీరోయిన్ గా ఉన్నపుడు సంపాధించినవని కోర్టుకు వివరించింది. అయితే కోర్టు విచారణలో అక్రమ ఆస్తులు నిజమేనని తేలింది. బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా నిర్థారించింది.

అప్పటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలుకాలోని మెల్కొటేలో 1948 ఫిబ్రవరి 24న జయ జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి (సంధ్య)లు. సంధ్య పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్లో జయ తన ప్రాథమిక విద్యను అభ్యసించింది.
మరోవైపు తల్లి నటిస్తున్న చిత్రాలలో జయలలిత కూడా నటిస్తుండేంది.

1964లో జయ తెలుగు సినిమాలోకి అడుగు పెట్టింది. మనషులు మమతలు ఆమె మొదటి తెలుగు సినిమా. అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్ తోపాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *