Tuesday, 3 November 2026

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో కేసీఆర్‌ బ’ాటీ

ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం బ’ాటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్గానికి ఆర్థిక సహాయంపై జైట్లీతో చర్చలు జరిపారు. అనంతరం ఎంపీ వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలు వెల్లడించారు. తెలంగాణకు ప్రత్యేక ¬దా, పన్ను రాయితీలు ఇవ్వాలని జైట్లీని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌ ఆదాయం ఎక్కువగా ఉందని జైట్లీ ప్రస్తావించగా.. రాష్ట్ర విభజన తర్వాత ఐఓసీ, హెచ్‌పీసీ వంటి ఆయిల్‌ కంపెనీలు హైదరాబాద్‌లో పన్నులు కట్టడం లేదని, ఏపీలో కడుతున్నాయని జైట్లీకి వివరించినట్లు చెప్పారు. ఉమ్మడి సంస్థలన్నీ గతంలో హైదరాబాద్‌లో పన్నులు కట్టేవి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ ఆదాయం తగ్గిందని సీఎం చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని విషయాలను సీఎం కేసీఆర్‌ ¬ం మంత్రికి వివరించినట్లు చెప్పారు. ఆర్థిక మంత్రి ఇరు రాష్గాలకు ప్రత్యేక ¬దా, పన్నురాయితీ ఇస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే అందులో 8 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయని ప్లానింగ్‌ కమిషన్‌ సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా వినోద్‌ గుర్తు చేశారు. రానున్న సప్లిమెంటరీ బడ్జెట్‌లో తెలంగాణకు కొంత వూరట లభిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ అందుబాటులో లేరని, ఆయన ఢిల్లీకి ఎప్పుడు వస్తే అప్పుడు తమ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి గోయల్‌ను కలస్తారని తెలిపారు. పిడికెడు బొగ్గు దొరకని ఆంధ్రాలో వేల మెగావాట్ల విద్యుత్‌ ఎలా ఉత్పత్తి అవుతుందనిచంద్రబాబును ప్రశ్నించారు. ఇందుకు తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కారణం కాదా అని ప్రశ్నించారు. తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు బస్సుయాత్రలు మాని దిగువ సీలేరు ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే దేశం నేతలు బస్సు యాత్రలు చేపట్టారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *