![]() |
హైదరాబాద్, అక్టోబర్ 11 : విద్యుత్ విషయంలో తమకు ముందు చూపు లేదంటున్న చంద్రబాబు కృష్ణపట్నంలో తమ వాటా ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని నేదనూరు, శంకరపల్లి ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకపోవడం వల్లే కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయన్నారు. కరువు కారణంగా కరెంటు కష్టాలు పెరిగాయని వెల్లడించారు. 17 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు. ఉమ్మడి రాజధానిలో వాడుకునే విద్యుత్ కూడా ఏపీ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వానికి మంచిపేరు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. దీపాళి తర్వాతే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి ఈటెల పేర్కొన్నారు.





