Tuesday, 3 November 2026

తెలంగాణ జూనియన్‌ డాక్టర్ల సమ్మె ఉద్ధృతం

హైదరాబాద్‌: తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉద్ధృతమైంది. రెండు రోజులుగా అత్యవసర సేవలను కూడా బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైద్య విద్యలో భాగంగా ఏడాదిపాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్‌ వైద్యులు సమ్మె బాటపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 19 రోజులుగా తెలంగాణలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్లి జూనియర్‌ వైద్యుల ఆందోళనకు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *