Tuesday, 3 November 2026

తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య

సుబేదారి(వరంగల్‌): జూనియర్‌ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు వెంటనే సమ్మె విరమించి వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి రాజయ్య జూడాలను కోరారు. శనివారం సర్క్యూట్‌ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడుతూ జూనియర్‌ డాక్టర్లు లేవనెత్తిన ఐదు డిమాండ్లలో నాలుగింటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జూడాలు చర్చలకు రావాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *