రంగారెడ్డి, అక్టోబర్ 18 : జిల్లాలోని పరిగి మండలంలో దారుణం జరిగింది. మల్లెమోనిగూడకు చెందిన అనసూయ బాణామతి చేస్తుందనే నెపంతో స్థానికులు ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. అవమానం భరించలేని అనసూయ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనసూయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




