Monday, 2 November 2026

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

కర్ణాటక: బెంగళూరులోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. బాలికను పాఠశాల నుంచి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లి బిడ్డ అస్వస్థతతో ఉండటాన్ని గమనించింది. జరిగిన సంఘటనను బాలిక తల్లికి చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అత్యాచారం, క్రిమినల్ చర్యల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. గడిచిన నాలుగు నెలల్లో బెంగళూరులోని పలు పాఠశాలల్లో మైనర్ బాలికలపై ఇటువంటి దారుణ ఘటనలు మూడు చోటుచేసుకున్నాయి. జరిగిన సంఘటనను తీవ్రంగా నిరసిస్తూ మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *