Monday, 2 November 2026

దీపావళి తర్వాతే మహరాష్ట్రకు రాజ్‌నాథ్‌

rajnath

ముంబై, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : దీపావళి పండుగ తర్వాతే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మహరాష్ట్రకు వెళ్ళనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజే పీ ఇంకా ఊగిసలాట ధోరణిలో ఉంది. దీపావళి తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రా నుంది. శివసేన మద్దతు తీసుకోవాలా? లేక ఎన్సీపీ మద్దతు తీసుకోవాలనే దానిపై ఆ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మహారాష్ట్ర పర్యటన మంగళవారం కూడా వాయిదా పడింది. దీపావళి తర్వాతే తాను ముం బై వెళ్తానని ఆయన ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికకు పరిశీలకు డిగా వెళ్లాల్సిన రాజ్‌నాథ్‌.. తాజా పరిణామాల నేపథ్యంలో తన పర్యటనను వాయిదా వేసు కున్నారు. మద్దతుపై శివసేన నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకపోవడం, ముందుగా తామే మద్దతు కోరితే ఉద్దవ్‌ థాకరే ఎలాంటి డిమాండ్లు పెడతారోననే ఆందోళనల నేపథ్యంలో బీజేపీ వేచి చూసే ధోరణిలో ఉంది. అందుకే రాజ్‌నాథ్‌ పర్యటన రెండ్రోజులుగా వాయిదా పడుతోంది. దీపావళి తర్వాతే ఆయన ముంబై వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పా టు, నాయకత్వ ఎంపికపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. ‘నేను ఈ రోజు వెళ్లడం లేదు. దీపావళి తర్వాతే ముంబై పర్యటన ఉంటుందని’ ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికలో అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? అని విలేకరులుప్రశ్నించగా ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన తెలిపారు.ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 22సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. పాత మిత్రపక్షమైన శివసేన 80 పైచిలుకు స్థానాలతో రెండో స్థానంలో, ఎన్సీపీ మూడో స్థానంలో నిలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రెండు పార్టీలలో ఎవరో ఒకరి మద్దతు తప్పనిసరి. అయితే, బయటి నుంచి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఎన్సీపీ ప్రకటించింది. కానీ, ఆ పార్టీ మద్దతు తీసుకొనేందుకు బీజేపీ సుముఖంగా లేదు. శివసేన కూడా కమలంతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా.. ముందుగా బయటపడడం లేదు. తమంత తాముగా వెళ్తే ప్రాధాన్యం ఉండదనే భావనలో ఉద్దవ్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎలాంటి ప్రతిపాదనలు చేసేందుకు సుముఖత వ్యక్తంచేయడం లేదు. తమంత తాముగా మద్దతు కోరితే ఉప ముఖ్యమంత్రి పదవి సహా పలు డిమాండ్లు పెట్టే అవకాశముండడంతో వేచి చూడాలని ఆ పార్టీ యోచిస్తోంది. మరోవైపు, ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలో సీనియర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, మహారాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నావిస్‌ పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏక్‌నాథ్‌ ఖాడ్సే, వినోద్‌ తావ్డేల పేర్లు కూడా సీఎం పదవి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *