నల్గొండ: నల్గొండ జిల్లా టీడీపీ నేతలు నేడు ఆందోళన బాట పట్టారు. తమ పార్టీ జిల్లా కార్యాలయంపై నిన్న జరిగిన దాడిని నిరసిస్తూ నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట తదితర ప్రాంతాలో కార్యకర్తలు బైక్‌లపై ర్యాలీలను చేపట్టారు. అదేవిధంగా పలుచోట్ల దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కిడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు.




