హైదరాబాద్: అంతర్జాతీయ బాక్సర్ సరితాదేవిపై సస్పెన్షన్ వేటుపడింది. రిఫరీలు తనపట్ల అన్యాయంగా వ్యవహరించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏఐబీఏ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. ఈమేరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆసియా క్రీడల సందర్భంగా ఆమె రిఫరీలపై ఆరోపణలు చేస్తూ కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసిన విషయం తెలిసిందే.




