Wednesday, 4 November 2026

విభజన సమస్యలకు

ప్రాధాన్యం ఇచ్చేనా..?ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండు రాష్టాల్ల్రో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరాయి. అయినా చిక్కుముళ్లు ఇంకా వీడడం లేదు. పనులు   నత్తనడకన సాగుతున్నాయి. సామాన్యులకు  ఊరట లభించడం లేదు. గోడు వెళ్లబోసుకున్నా కనికరించే స్థాయిలో కేంద్ర ప్రభుత్వ  చర్యలు ఉండడం లేదు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రచార పటాటోపం తప్ప మరోటి కానవరావడం లేదు. కార్పోరేట్‌ కంపెనీలకు ఎంత దగ్గరయితే అంతమంచిదన్న ధోరణిలో బిజెపి ఉంది. ఈ దశలో విభజన జరిగి రెండు కొత్త రాష్టాల్రు ఏర్పడ్డా వాటి సమస్యలను గాలికి వదిలేశారు. విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని స్వయంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంగీకరించినా వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవటంలేదు. కనీసం ఓ కమిటీని వేసి ఉన్న లోపాలను గుర్తించి, పరిష్కరించే చొరవ చూపడం లేదు. అంటే ప్రభుత్వం ఎంత నిర్లిప్తంగా ఉందో గమనించవచ్చు. ప్రచారం కొంతమేరకు మాత్రమే పనికి వస్తుందని బిజెపి గుర్తుంచుకోకపోవడం వల్లనే ఢిల్లీ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అయినా రెండు రాష్టాల్ర మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరగాలి. అందుకు బిజెపి నేతలు తమవంతుగా కృషి చేయాలి. ఈ విషయంలో ఎపి కాంగ్రెస్‌ కొంతయినా కదలిక తీసుకుని వచ్చిందనే చెప్పాలి. హడావిడిగా విభజన చేసి, ఎవరితోనూ చర్చించకుండా ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేకుండా చేశాయి. అయితే ఇచ్చిన హావిూలపై ఎపికి ప్రత్యేక ¬దా తదితర అంశాలపై పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి చేస్తున్న పోరాటం కొంత కదలిక తీసుకుని వచ్చిందనే చెప్పాలి. ఆంధప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దా అంశంపై ఆయన సోనియాను, మన్మోహన్‌ను కలసి పరిస్థితిని వివరించారు. ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి వివరించారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టిడిపి పెద్దగా సాధించుకున్నది ఏదీ లేదు. కేంద్రంతో సఖ్యత వల్ల నిధులు పెద్దగా రాబట్టుకోవడం లేదా పనులు చేయించుకోవడం జరుగుతుందని టిడిపి భావించినా అంతగా ప్రయోజనం కలగడం లేదు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ కూడా ఇదే విధానంతో ముందుకు పోవాలని చూస్తోంది. నిజానికి రాష్టాల్రకు జరిగిన అన్యాయాలపై పోరాటాల ద్వారా సాధించుకోవాలి. కేంద్ర పెత్తనాన్ని తిప్పికొట్టేలా చూడాలి. కానీ స్నేహంగా ఉన్నా పనులు జరగడం లేదు. ఈ అంశంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేయలేని పనిని అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్‌ పార్టీ బయటనుంచే పోరాటం చేస్తూ విబజన చట్టం మేరకు రావాల్సి అంశాలపై పోరాడుతోంది. రఘువీరారెడ్డి ప్రత్యేక ¬దా కోసం అంటూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం  చర్చల్లో నానుతోంది. ఆయన ఢిల్లీకి వెళ్లి సోనియాకు విన్నవించడం, ఆమె ప్రధాని మోడీకి లేఖరాయడం తదితర అంశాలు కొంద కదలిక తీసుకుని వచ్చేవిగా ఉన్నాయి. రాష్ట్ర  విభజన దెబ్బకు అడ్రస్‌ లేకుండా పోయిన కాంగ్రెస్‌ పార్టీ బతుకు జీవుడా అంటూ ఇఫ్పుడు ప్రజా  సమస్యలపై ఫోకస్‌ పెట్టిందనడానికి కోటి సంతకాల సేకరణ ఉదాహరణగా చెప్పుకోవాలి. రాజధాని రైతుల భూసేకరణ సమస్యతోపాటు ప్రత్యేక ¬దా విషయంలో కాంగ్రెస్‌ దూకుడుగానే  వెళుతోంది. కోటి సంతకాల ఉద్యమం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం ఎలా ఉన్నా సమస్యలపై రంగంలోకి దిగిందన్న విషయం మాత్రం గుర్తించాలి. ఆంధప్రదేశ్‌ కు ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక ¬దా విషయంలో ఎక్కడలేని కదలిక తీసుకురావటంలో విజయం సాధించారు. నిజానికి విభజన సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా ఇవాళ అనేక సమస్యలను ఇరు తెలుగు రాష్టాల్రు ఎదుర్కొంటున్నాయి. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న రీతిలో విభజించి పెట్టారు. అందుకే ప్రత్యేక ¬దాతో పాటు సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్‌ తీసుకోవాలి. వాస్తవానికి ప్రత్యేక ¬దా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా చేతులెత్తేశారు.  కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో కేంద్రం నుంచి ప్రత్యేక ¬దా అనుమానమేనని,మిత్రపక్షంగా ఉన్నందున పెద్దగా ఒత్తిడి చేయలేమని విస్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దాపై గళమెత్తిన వెంకయ్యనాయుడు కూడా అధికారంలోకి వచ్చాక ‘ప్రత్యేక ¬దా’కు ఇతర రాష్టాల్రు అభ్యంతరం చెబుతున్నాయని..ఇది అంత తేలిగ్గా సాగే అంశం కాదని పదే పదే ప్రకటించారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తొలుత ఐదేళ్ల పాటే ప్రత్యేక ¬దా ఇవ్వాలని ప్రతిపాదిస్తే పదేళ్ళ పాటు కావాలని రాజ్యసభలో పట్టుబట్టి మరీ పంచాయతీ పెట్టారు. కానీ అధికారంలోకి రాగానే సీన్‌ రివర్స్‌ అయింది. రఘువీరారెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ లతో భేటీ ప్రత్యేక ¬దా అంశంపై చర్చించటంతో వేడి మరింత పెరిగింది. అయితే దీనిపై సోనియా ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రస్తావిస్తేనే మంచిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేక ¬దాపై  ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించటం ద్వారా కొంతయినా  ప్రయోజనం పొందాలని కాంగ్రెస్‌ పార్టీ  చూస్తోంది.  విభజన చట్టం హావిూ ఇచ్చిన మేరకు  ప్రత్యేక ¬దాపై కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి రోజుకో పిల్లిమొగ్గ వేస్తూ రాష్ట్ర ప్రజలతో పరిహాసమాడుతోంది.  రాష్ట్ర విభజన మూలంగా ఆంధ్ర ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు, కొత్త రాజధాని నిర్మాణానికి ఉదారంగా సాయం అందిస్తామన్న హావిూ గురించి అడిగితే అలా ఇవ్వాలని చట్టంలో ఎక్కడుందో చూపండి అని ఎదురు ప్రశ్నిన్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడా అదే పరిస్థితి నెలకొని ఉంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సాయం అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు కేంద్రం తరపున అందాల్సిన నిధులపై ఎలాంఠి స్పందన రావటంలేదు. విభజన చట్టంలోని లోపాల మూలంగా ఇరురాష్ట్రాలు పలు సమస్యల పరస్పరం బాహాబాహీకి దిగుతున్నాయి. ఇటీవల సాగర్‌ జలాల వివాదంపై రేగిన దుమారం చివరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై పరిష్కరించుకున్నారే తప్ప కేంద్రం చేసిందేమీలేదు. మరోవైపు హామీల్ని అమలు చేయించుకోవటానికి కేంద్రంపై పోరాటం చేయాల్సిన రాష్ట్ర సర్కారు కేంద్రంలో చేరేంధుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారం మరింత జఠిలమయ్యే పరిస్థితి దాపురించింది. తద్వారా కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఏర్పడింధి. మొక్కుబడిగానే హస్తిన పర్యటనలుంటున్నాయి తప్ప ఇప్పటివరకు హస్తిన వెళ్లి సాధించిందైతే ఏమీ కనిపింఛటంలేదు. కేంద్రంపట్ల ఇలాగే ఉదాసీన వైఖరి కొనసాగిస్తే భవిష్యత్‌లో సమస్యలు మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరింత చొరవ చూపి కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరముంది. తమ పార్టీ ఎంపీలను టీఆర్‌ఎస్‌ తరపున రాష్ట్రం కోసం ఆందోళనలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు సమస్యల పరిష్కారానికి ఆందోళనలద్వారా మార్గం సుగమమవుతుంది. ఇక విభజన చట్టంలో లోపాలను సవరిస్తామంటున్న కేంద్రం ఈ సమావేవాల్లోనే దీనిపై చర్చించి చిత్తశుద్దిని చాటుకోవాల్సిన అవసరం అంతే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *