9కి పెరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య
రైల్యేకోడూరు : వైఎస్‌ఆర్ జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ, ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మెదక్ జిల్లావాసులు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.


