హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం (ఈసీ) నగారా మోగించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలో పోలింగ్ స్టేషన్ సంఖ్య కూడా ఈసీ భారీగా పెంచింది.
ప్రస్తుత ఎన్నికలకు 9.30 లక్షల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు.
గత ఎన్నికల్లో వీటి సంఖ్య 8.30లక్షలు కాగా, ఈ సారి 11.9శాతం పెరిగాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్సించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.




