బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

అసెంబ్లీలో తీర్మానంపై చర్చలో మాటల యుద్దం
కెసిఆర్‌ను ఏకి పారేసిన సిఎం రేవంత్‌
బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు
హైదరాబాద్‌, జులై 24 (జనం సాక్షి)

కేంద్ర బడ్జెట్‌లో రాష్టాన్రికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి, భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అవగాహనా రాహిత్యంతో కేటీఆర్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సిఎం రేవంత్‌ అన్నారు. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్‌ ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు ’మాకు జవాబు చెప్పండి చాలు. విూకు కేసీఆర్‌ అవసరం లేదు’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడంతో సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తండ్రి పేరు చెప్పుకొని నేను మంత్రిని కాలేదు. కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యా. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్‌ కోటా అనుకున్నా. అంతకంటే దారుణం అని అన్నారు. ఆ వెంటనే కేటీఆర్‌ స్పందిస్తూ ’రేవంత్‌ పేమెంట్‌ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చు’ అని వ్యాఖ్యానించారు. దానికి రేవంత్‌ మళ్లీ కౌంటర్‌ ఇస్తూ ’పేమెంట్‌ కోటాలో సీఎంను కాలేదు. మొన్న భారాస నేతలు దిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ స్పందిస్తూ ‘మేనేజ్‌మెంట్‌ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా? సభా నాయకుడు అలా మాట్లాడొచ్చా?‘ అని ప్రశ్నించారు. ఆ తర్వాత మళ్లీ సీఎం రేవంత్‌ మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ‘మాకేవిూ అక్కర్లేదు.. విూ ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్‌. విద్యుత్‌పై రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక విధానమే లేదు. రూ.7లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయారు. భారాస పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. గత ప్రభుత్వ పరిపాలనలో విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విూరేం చేశారో చూశాకే ప్రజలు తీర్పు ఇచ్చారు. భారాసకు అసెంబ్లీలో వచ్చిన మెజారిటీ లోక్‌సభ ఎన్నికల్లో రాలేదు. లోక్‌సభలో
గుండుసున్నా దక్కినా తీరు మారకుంటే ఎలా?ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడాలని కోరుతున్నా‘ అని సీఎం అన్నారు. అనంతరం కేటీఆర్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చర్చను సమర్థిస్తున్నట్లు తెలిపారు. ‘విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడాం. మోదీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాం. రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతాం. యాచిస్తే ఏవిూ రాదు.. శాసించి సాధించుకోవాలి. దిల్లీ తత్వం ఇంతకాలానికి కాంగ్రెస్‌కు బోధపడిరది. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే విూకేం ఇబ్బంది కేంద్ర వివక్షను ఎండగట్టడంలో మేం సహకరిస్తాం. గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశాం. రేవంత్‌ రెడ్డి కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నవయసులోనే సీఎం అయ్యారు. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకూ మేం మద్దతివ్వలేదు. దళితుడు రాష్ట్రపతి, తెలుగు బిడ్డ ఉపరాష్ట్ర అభ్యర్థులగా అయ్యే సమయంలో మద్దతిచ్చాం. కేసీఆర్‌ను కాదు.. ధైర్యముంటే మోదీని తిట్టండి. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం. ఎన్నికల తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల గురించి ఆలోచిద్దాం. ఏం చేసినా బహిరంగంగానే చేశాం.. చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్టాన్రికి ఏవిూ ఇవ్వకుంటే మేమేం చేస్తాం అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ పవర్‌ సర్కిల్‌ను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. ఎవరో పత్రికల్లో రాసినదాన్ని పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా? కేటీఆర్‌ సభతోపాటు రాష్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. భారాస వాళ్లలా ఏది పడితే అది చేసేవాళ్లం కాదు. సింగరేణి అంశంపై చర్చించేందుకు మేం సిద్ధం అని భట్టి స్పష్టం చేశారు.తెలంగాణలో శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరగడంపై జరిగని చర్చలో భాగంగా రేవంత్‌, కేటీఆర్‌ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సభలో ఉండి సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో మాట్లాడిరచడంపై కేటీఆర్‌ విమర్శించగా.. రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని.. ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని.. బ్జడెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చకు అనుమతించాలని కోరామని.. సభకు లేట్‌గా వచ్చిన సభ్యుడు అసలు విషయం తెలుసుకోకపోతే ఎలా అన్నారు. నాలుగు కోట్ల తెలంగాన ప్రజల హక్కుల గురించి సభలో చర్చ జరుగుతున్నప్పుడు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. పదేళ్లు సీఎం అని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. సభలో కనిపిస్తే ప్రధాని మోదీ ఏమనుకుంటారో అనే భయంతో కేసీఆర్‌ ఎక్కడో దాక్కున్నారంటే రేవంత్‌ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష సభ్యులు వివాదాల జోలికి వెళ్లకుండా స్జబెక్ట్‌పై మాట్లాడాలని సూచించారు. సభలో ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభను కేటీఆర్‌ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. గాలివాటం మాటలను సభలో మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా ప్రతిపక్షం తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. ఢల్లీి వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని.. సభలో ఆ చీకటి ఒప్పందాల గురించి చెప్తారా.. లేదా బడ్జెట్‌పై ఇంకేమైనా వాళ్ల అభిప్రాయం చెబుతారో తెలుసుకోవడానికి చర్చను ప్రారంభించామన్నారు. ఇప్పటిరవకు కేటీఆర్‌ పేమెంట్‌కోటా అనుకున్నానని.. కానీ ఇప్పుడే ఆయన అబ్సెంట్‌ ల్యాండ్‌ లార్డ్‌ అని తేలిందన్నారు. మా నాన్న మాకు చదువు లేకపోయినా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తాము స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగామన్నారు. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశానని.. తాను తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రి అవ్వలేదన్నారు. అవతలి వారిని కించపర్చాలనే ఉద్దేశంతో అహంకారపూరితంగా
మాట్లాడటం సరికాదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేంద్రంలోని మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు మద్దతు తెలిపారన్నారు. జిఎస్టీ, రైతు చట్టాలపై కేంద్రంలో బీజేపీకి కేసీఆర్‌ మద్దతు తెలిపారన్నారు. తెలంగాణను అప్పులలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. మోదీతో పదేళ్లపాటు స్నేహం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ తెలంగాణ హక్కుల కోసం మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారని.. లేదంటే ప్రజలు బీఆర్‌ఎస్‌ నాయకులను క్షమించబోరన్నారు. ఎన్నో రకాల జబ్బులు ఉన్న వ్యక్తి.. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా.. తనకు పెళ్లికి పిల్ల కావాలని అడిగినట్లు బీఆర్‌ఎస్‌ తీరు ఉందన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి పాపాలు పొగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేసినట్లు బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఉందన్నారు.