Friday, 6 November 2026

ఆదిలాబాద్

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తిన వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామకృష్ణాపూర్‌లో మెడికల్‌ కళాశాలను సీఎం అడ్డుకున్నారని ఆరోపించారు. రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ కోసం సీఎం ఎలాంటి కృషి చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పదవి వదులుకోవడానికైనా సిద్దమని గతంలోనే…

నిర్మల్‌ మున్సిపల్‌ ఆఫీస్‌కు కరెంట్‌ కట్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): నిర్మల్‌ మున్సిపల్‌ కర్యాలయానికి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్‌ కట్‌ చేశారు. రూ. 1.64 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారలు ట్రాన్స్‌కో నోటీసులు జారీ చేసింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు, సిర్పూరు, నార్నూరు మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో తెలుగు గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. వనద ప్రభావం ఉన్న కౌతాల, బెజ్జూరు మండలాల ప్రజల భయాందోళనతో గడుపుతున్నారు. వరదల…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భైంసా: పట్టణంలోని రెండు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేణుగోపాలాచారి శంకుస్థాపన చేశారు. ప్రణాళికేతర నిధుల రూ. 13లక్షలతో పోలీస్‌స్టేషన్‌ రోడ్డు అభివృద్ధికి, అలాగే రూ. 25లక్షలతో మెప్మా మహిళా స్వశక్తి భవనం నిర్మించేందుకు శిలాఫలకాలు నిర్మించారు. ఈ కార్యక్రమంలో…

రాయితీ సిలెండర్లు స్వాధీనం

బైంసా: బైంసా పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న వంట గ్యాస్‌ రాయితీ సిలిండర్లను పౌరసరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పౌరసరఫరా శాఖాధికారుల బృందం శనివారం అకస్మికంగా పలు హోటళ్లను తనిఖీ చేసింది. ఈ…

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని ఏపీనగర్‌కు  చెందిన అమ్మదాసు (19) స్థానిక ఎంబీకాలనీలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్‌.ఐ నరేష్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేశారు.

టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం డ్రామా: కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం ఓ డ్రామా అని తెలిపారు. చిత్తశుధ్ది ఉంటే అధిష్ఠానంతో కొట్లాడాలని పేర్కొన్నారు. జులై…

గిరిజనులపై దాడికి యత్నం

నెన్నెలా : మండలంలోని కృష్ణపల్లి గ్రామానికి చెందిన గిరిజనులపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించగా గ్రామస్థుల సహకారంతో గిరిజనులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల గిరిజనులకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసిన భూమిని పట్టాదారు అక్రమించుకొని…

భారీ వర్షాలకు కూలిన విద్యుత్‌ స్తంభాలు

ఆదిలాబాద్‌, (జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భీమిని మండలంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షం కారణంగా 50 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ వాగు ఉధృతితో అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జేనాథ్‌ మండలంలో…