Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీవర్షం

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజనగర్‌ మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని రాజ్‌పల్లి, బారేగూడ, పోతెపల్లి వాగులు ఉపొంగుతున్నాయి. వాగులపై వంతెనలు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని…

ఆదిలాబాద్‌ జిల్లాలో భూకంప వదంతులు

ఆదిలాబాద్‌: భూకంపం వస్తోందనే వదంతులు శుక్రవారం రాత్రి జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల్లో వదంతులు రావడంతో ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి పరుగులు తీశారు. అర్థరాత్రి 2 గంటల నుంచి రోడ్లపైనే…

చెరువులో పడి ఒకరి మృతి

భైంసా: మండలంలోని సిద్దూర్‌ గ్రామంలో ఎడ్లను చెరువులో స్నానం చేయించేందుకు వెళ్లి విఠల్‌ అనే రైతు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారమందుకున్న భైంసా గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌కేంద్రం ముట్టడి

పోతుమండల్‌: అప్రకటిత విద్యుత్‌కోతలు నిలిపివేయాలని కోరుతూ మండలంలోని సోనాల గ్రామస్థులు స్థానిక విద్యుత్‌కేంద్రాన్ని ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. విద్యుత్‌కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేశారు.

అనారోగ్యంతో మాజీ ఎమ్మేల్యే మృతి

ముథోల్‌: మండలంలోని అస్తా గ్రామంలో మాజీ ఎమ్మేల్యే హనుమంతరెడ్డి(80) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈయన 1985వ సంవత్సరంలో తెలుగుదేశం మొదటి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. ఈరోజు ఉదయం…

డయేరియాతో మహిళ మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఖాసీపేట మండలం కోలంగూడలో డయేరియా ప్రబలి మహిళ మృతి చెందింది. గ్రామంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య సిబ్బంది పట్టించుకోక పోవడంతోనే మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు గిరిజన సంఘాలు ఆరోపించాయి.

ఆదిలాబాద్‌లో కుప్పకూలిన భవనం, కార్మికుని మృతి

ఆదిలాబాద్‌: నగరం మద్యలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శథిలాల కింద ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. స్థానికులు అప్రమత్తమయి వారిని కాపాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా…

భక్తులతో కిటకిటలాడుతున్న బాసర

ఆదిలాబాద్‌: బాసర భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రావణమాసం చివరిరోజులు కావడం, వరసగా సెలవులు రావటంతో సరస్వతీదేవి దర్శనానికి భక్తులు పోటేత్తారు. గోదావరి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పలువురు చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తున్నారు.

వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు .. సీఎంకు పొన్నం హితవు హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి : సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం…

అతిసారతో మహిళ మృతి

కోట్లపల్లి: కోట్లపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన పోచమ్మ అనే మహిళా అతిసారతో మృతి చెందింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రైవేటు వైద్యుల వద్ద ఆమె చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఈ ప్రాంతంలో అతిసారతో…