Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

ఆదిలాబాద్‌: బెల్లంపల్లి విద్యుత్తు ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గుగనులపై కూడా పడింది. సాయంత్రం 5గంటల నుంచి 19గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ఐదో జోన్‌లో ఖాళీగా ఉన్న ఉర్దూ మాద్యమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పోస్టుల కోసం జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌అశోక్‌ పేర్కొన్నారు. మొత్తం పది పోస్టులు ఖాళీగా…

‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీఐ శాసనసభ పక్ష నేత జి. మల్లేష్‌ అన్నారు. కేంద్రం తక్షణమే ఈప్రాజెక్టుకు…

బోగస్‌ కార్డుల ఏరివేత జరిగేనా

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్‌ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది కుటుంబాలు ఉండగా, అంతకుమించి…

మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ అర్హత పరీక్షలు, ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలన్నీ ఆదిలాబాద్‌లో…

కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టిన శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థునులు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఈ రోజు రాఖీ వేడుకలజరిపారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థునులు వివిధ పోలీసు స్టేషన్లలలో పోలీసులుకు కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టారు.

ఎంఐఎంచే ఇఫ్తార్‌ విందు

ఆదిలాబాద్‌: ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్‌ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులు

బెజ్జూరు: మండలంలోని కొండపల్లిలో అంతుచిక్కని వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికే మూడు పశువులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. పశువులకు కళ్లలో నుంచి నీరుగారి చూపు కోల్పోయి మృతిచెందుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.

ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యం రాస్తారోకో

బెల్లంపలి: ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యకమంలో ఎన్‌ఎన్‌యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణ మోహన్‌, పట్టణ కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా

నిర్మల్‌: నిర్మల్‌ మండలం సోన్‌ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు కోత విధించటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని జాఫ్రాపూర్‌, కర్తాల్‌,…