Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు:‌ ఎల్‌.రమణ, ఎర్రబెల్లి

మహబూబ్‌నగర్, ఆగస్టు13:‌ ‌టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తామని టీడీపీని విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని ఎల్‌.రమణ విమర్శించారు. టీడీపీ హయాంలో 4 ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు ఖర్చు చేశాం,…

కాసేపట్లో పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటన..

మహబూబ్ నగర్ : పెబ్బేరు (మం) పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటించనుంది. రెండు నెలల క్రితం దళితులపై దాడి నేపథ్యంలో ఈ పర్యటన జరుగనుంది. ఈ సందర్భంగా బాధితులను బృందం పరామర్శించనుంది

గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు ఉదయం ఐదు గంటలకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇంటి నుంచి బయలుదేరిని…

నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-హెల్త్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సేవలను మంత్రి…

మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టుల పూర్తి – కేసీఆర్.

మహబూబ్ నగర్ : మూడేళ్లోలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూత్పూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రూ.35,200 కోట్లతో ఎత్తిపోతల…

పోలవరం ఎత్తిపోతలపై సమీక్షించిన కేసీఆర్

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కరివెనలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌లో లంచ్…

ఆర్టీసీ బస్సు బోల్తా:10 మందికిగాయాలు

మహబూబ్ నగర్: జిల్లాలో అడ్డాకుల మండలం హైవే సమీపంలో కొమ్మిరెడ్డిపల్లి దగ్గ సోమవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది వరకు ఉన్నట్లు…

ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరం:తమ్మినేని

మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరంగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది పాలనలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.…

లారీనీ ఢీకొన్నడీసీఎం: ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఫరూక్ నగర్ మండలం రాయకల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యానులోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు అనంతపురం…