Saturday, 21 November 2026

హైదరాబాద్

39 మంది విద్యార్థినులకు అస్వస్థత

రెడ్డిగూడెం, కృష్ణా: కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 39 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారిని నూజీవీడు ఏరియా అసుపత్రికి తరలించారు. నూజివీడు ఆర్డీవో సుబ్బారావు , ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. బాలికలకు చికిత్స జరుగుతోంది.…

గుంటూరు వైద్యకళాశాలలో ఎంపీఐ బృందం తనఖీలు

గుంటూరు వైద్యం : గుంటూరు వైద్య కళాశాలలో 150 నుంచి 200లకు సీట్లు పెంచాలని పంపిన ప్రతిపాదనపై భారత వైద్య మండలి తనిఖీ బృందం బుధవారం కళాశాలకు వచ్చి పరిశీలన జరుపుతోంది. డాక్టర్‌ పాటిల్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ…

నిమ్స్‌లో భాజపా నేతల దీక్ష విరమణ

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ చార్జీల పెంపునై నిమ్స్‌లో కొనసాగిస్తున్న దీక్షను భాజపా నేతలు విరమించారు. పార్టీ జాతీయ  నేత రవిశంకర్‌ప్రసాద్‌ రాష్ట్ర పార్టీ  అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌, యెండల లక్ష్మీనారాయణలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పాత…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు గంట సమయం పడుతోంది.

విజయవాడలో వామపక్షాల ఆందోళన

విజయవాడ : తాగునీరు, డ్రైనేజీ ఛార్జీల పెంపుపై వామపక్షాలు విజయవాడలో ఆందోళనకు దిగాయి. నగర పాలక సంస్థ కమిషనర్‌ ఛాంబంర్‌ను ముట్టడించి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పలువురి నేతలను పోలీసులు అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

శ్రీవారిని దర్శించుకున్న జయప్రద

తిరుమల : ఎంపీ జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చిట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఏసీబికి చిక్కిన ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు: మంగళగిరి ఎక్సైజ్‌ సీఐ యశోధరాదేవి 14వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలోని మంగళగిరి ఎక్సైజ్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు.

ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

క్షీణిస్తున్న కిషన్‌రెడ్డి ఆరోగ్యం

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ భాజపా నేతలు నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే దీక్షలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అరోగ్య పరిస్థితిపై వైద్యులు అందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా నిరవధిక…

చెట్టు కూలి నాలుగు ఇళ్లు ధ్వంసం

హైదరాబాద్‌ : నగరంలో రాత్రి కురిసిన భరీ వర్షానికి సనత్‌నగర్‌లో ఓ చెట్టు నేలకొరిగింది. దీంతో  సమీపంలో ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు…