Saturday, 21 November 2026

హైదరాబాద్

కోమా నుంచి బయటపడ్డ జెస్పీ రైడర్‌

వెల్లింగ్‌ టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జెస్సీ రైడర్‌ కోమా నుంచి బయటపడ్డాడు. వెంటిలేటర్‌పై నుంచి అతడిని ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం జెస్సీ రైడర్‌ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన ఘటనను అతను…

మడోనా ఆస్తులు రూ.5,428 కోట్లు

లాస్‌ ఏంజెలిస్‌ : ప్రముఖ పాప్‌ గాయని మడోనా (54) అరుదైన ఘనత సాధించారు. వంద కోట్ల డాలర్లు (రూ.5,428 కోట్లు) సంపాదించిన తొలి పాప్‌ గాయనిగా రికార్డు సృష్టించారు. గత ఏడాది ‘ఎండీఎన్‌ఏ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన…

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం : మంత్రి సారయ్య

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తి తో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి సారయ్య వరంగల్‌లో వెల్లడించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ బారీగా పెరిగింది. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయన్న ఆందోళనతో కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు.

మెదక్‌ డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌ : సంగారెడ్డి కలెక్టరేట్‌ లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ,ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే నేతల పరస్పర దూషణలకు దిగారు.

ఆ కళాశాలలకు రియెంబర్స్‌మెంట్‌ వర్తించదు: ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌ ,పార్మా కళాశాలల ఫీజు ప్రతిపాదనలను వెంటనే ఏఎఫ్‌ఆర్సీకి ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయాలని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. పెంచిన ఐదు రోజుల గడువు నేటితో ముగుస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో ఫీజు ప్రతిపాదనలను…

భారత జాలర్లను కాల్చి చంపిన కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూడిల్లీ : భారత జాలర్లను ఇటలీ నావికా సిబ్బంది కాల్చి చంపిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనుంది. దీనిపై నోటిఫికేషన్‌ను అధికారులు వచ్చే వారం విడుదల చేయనున్నారు.

వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి అంత్యక్రియలు:కేంద్రమంత్రి బేనీ ప్రసాద్‌

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి బేని ప్రసాద్‌ వర్మ మరోసారి తనదైన శైలిలో సమాజ్‌వాది పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.ఎస్పీ ఆధినేత ములాయంసింగ్‌ యాదవ్‌కు తీవ్రవాదులతో సంబందాలు ఉన్నాయని ఇటీవల వివాదాస్పద వాఖ్యలు చేసిన ఆయన ఈసారీ ఆపార్టీ…

ఎండిన పంటలను చూపిస్తాం .. రాజీనామా చేస్తారా?: మంత్రి పొన్నాలకు తెరాస సవాల్‌

హైదరాబాద్‌ : మంత్రి పొన్నాల నియోజకవర్గంలోని జనగాం,రఘనాథపల్లి ,ఖిలాషాపూర్‌లో ఎండిన పంటలను తెరాస ఎమ్మెల్యేల బృందం పరీశీలించింది. ఎండిన పంటలను చూపిస్తే రాజీనామా చేస్తారా అని మంత్రి పొన్నాల కు తెరాస నేత ఈటెల రాజేందర్‌ సవాలు విసిరారు.తెలంగాణ…

వచ్చే నెల 3న వైకాపా ధర్నా

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై వచ్చే నెల 3న అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు వైకాపా తెలిపింది.నల్గొండలో జరిగే ధర్నాలో ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు.