Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఈ నెల 24 నుంచి విజ్ఞానోత్సవ్‌

హైదరాబాద్‌: విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మరోమారు విజ్ఞానోత్సవ్‌ నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్స్‌ వైన్‌ ఛైర్మన్‌ రాణి రుద్రమదేవి ప్రకటించారు. విద్యార్థులో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ నెల…

కేవీపీపై నాగం జనార్థన్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావుపై నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నెల రోజుల గడువు విధించగానే కేవీపీ తన కుట్రలను మొదలు పెట్టిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల…

తెలంగాణ కోసం మిలిటెంట్‌ పోరాటం : ఎన్‌డీ

హైదరాబాద్‌: ఈ నెల 28లోగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే మిలిటెంట్‌ తరహా పోరాటాలు చేస్తామని న్యూడెమోక్రసీ పార్టీ హెచ్చరించింది. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు మోసం చేస్తూనే ఉందని ఆ పార్టీ హెచ్చరించింది.

జనక్రాంతి పార్టీ బీజేపీలో విలీనం

లక్నో : జనక్రాంతి పార్టీ బీజేపీలో సోమవారం విలీనమైంది. జనక్రాంతి పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ అధికారికంగా ప్రకటించారు.

బీఎస్‌ఎఫ్‌ జవానుపై దుండగుల కాల్పులు

మహబూబ్‌నగర్‌ : బీఎస్‌ఎఫ్‌ జవానుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పెద్దమందడి మండలం జగత్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన జవానును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

టీచర్‌ను కాల్చిచంపిన మావోయిస్టులు

మహారాష్ట్ర  : కాంకేర్‌ జిల్లా మత్తూరులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీచర్‌ ను మావోయిస్టులు కాల్చిచంపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

వరంగల్‌ : వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. లారీ -బైక్‌ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపు

మెదక్‌ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అరెస్టుకు నిరసనగా ఇవాళ, రేపు సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపునిచ్చింది. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో దుకాణాలను ఎంఐఎం కార్యకర్తలు మూసివూయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా…

కేంద్ర ప్రభుత్వానికి కోదండరాం హెచ్చరిక

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరిక చేశారు. ఈ నెల 29లోపు తెలంగాణ ప్రకటించకపోతే మిలిటెంట్‌ తరహా ఉద్యమాలు చేయడానికి సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. రహస్యంగా చర్చలు జరిపి ఉద్యమ కార్యాచరణను…

జైపాల్‌రెడ్డితో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హస్తినలో అందుబాటులో ఉన్న టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ     రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ…