Tuesday, 17 November 2026

హైదరాబాద్

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతా : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్‌ షూట్‌లోని బట్టల గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అర్పుతున్నారు. అన్ని సమాచారం తెలిసింది.

నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు సీబీఐ కోర్టులో లొంగిపోనున్నాడు. ఆయన శబరిమల వెళ్లేందుకు సీబీఐ కోర్టు డిసెంబర్‌ 24 నుంచి జనవరి 2 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ గడువు…

కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

మెదక్‌ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం అనాజ్‌పూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం కర్రెల పోచయ్య (18) అనే డీగ్రీ విద్యార్థి గ్రామంలో జరుగుతున్న పెండ్లికి హాజరయ్యాడు. పెండ్లి పనుల్లో…

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

హయత్‌నగర్‌  : హైదరాబాద్‌ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామ సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు, మృతుడిని రామాందపూర్‌ గోపినగర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డిగా గుర్తించారు. రాజేందర్‌రెడ్డి కనిపించడం లేదంటూ మూడు…

నేడు భారత్‌- పాక్‌ రెండో వన్డే

కోల్‌కత : వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌ – పాకిస్తాన్‌లు ఈ రోజు ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా రెండో వన్డే అడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్‌ క్రికెట్‌లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

న్యూఢిల్లీ: మజ్లీన్‌ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీపై దేవరాజధాని పార్లమెంటరీ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు నమోయింది. ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభలో అక్బర్‌ చేసిన వ్యాఖ్యలు లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడిలావుందంటూ సామాజిక కార్యకర్త షబ్మమ్‌ హష్మీ…

రెండేళ్ల గరిష్టానికి స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: బుధవారం స్టాక్‌మార్కెట్‌ దూసుకుపోయింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌ 133,43 పాయింట్ల లాభంతో 19714,24 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 42.40 పాయింట్ల ఆధిక్యంతో 5993.25 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.. అమెరికాల్‌ ఫిస్కల్‌ క్లివ్‌…

భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

నిజామాబాద్‌: మధ్యాహ్నం భోజనం వికటించి 29 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన లింగపేట మండలం సజ్జనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు…

రొహింగ్యాలను వెనక్కు పంపనున్న ధాయ్‌లాండ్‌

బ్యాంకాక్‌: మియన్మార్‌నుంచి తమ దేశ సముద్రజలాల్లోకి ప్రవేశించిన రొహింగ్యా శరణార్దులను వెనక్కు పంపనున్నట్టు థాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి శరణార్దులు మలేషియా వెళుతున్నప్పటికీ సముంద్రంలో అంత దూరం పడవల్లో ప్రయాణం సురక్షితం కాదని థాయ్‌ అధికారులు పేర్కొన్నారు.

మజ్లిన్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన భాజపా

హైదరాబాద్‌: మజ్లిన్‌ పార్టీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర భాజపా శాఖ ఫిర్యాదు చేసింది. మజ్లిన్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని భాజపా బృందం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.