Monday, 16 November 2026

హైదరాబాద్

నగల దుకాణంలో చోరీ

హైదరాబాద్‌: తార్నాకాలోనిగోల్డ్‌ వరల్డ్‌ నగల దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు నిన్న రాత్రి దుకాణం తాళాలు బద్దలుకొట్టి లోనికి చొరబడి30 తులాల బంగారం,5కిలోల వెండిని దోచుకెళ్లినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

కేకే ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు ఇంటి ముందు తెలంగాణ న్యాయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటికి పార్టీల నుంచి ఇద్దరిని పిలవడంపై వారు మండిపడ్డారు. తెలంగాణ అంశాన్ని నాన్చే…

రైలు ప్రమాదంలో విద్యార్థి మృతి : కాన్పూర్‌లో ఉద్రిక్తత

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలో రైలు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సహ విద్యార్థులు ఆగ్రహంతో నగరంలో ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. పలు బస్సులను…

జేఎన్‌టీయూలో సిబ్బంది బంపర్‌ ఆఫర్‌

విద్యార్థులు ఇంటి వద్దే చూచిరాతకు బేరం జేఎన్‌టీయూలో భారీ కుంభకోణం సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి): జెఎన్‌టియూ పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌ వెలుగుచూసింది. జవాబు పత్రాలను విద్యార్థుల ఇంటికే పంపి పరీక్షలు రాయించేందుకు…

ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చాందినీ చౌక్‌లోని విద్యుత్‌ ఉపకరణాలు అమ్మే భగరథ్‌ ప్యాలన్‌లలో అగ్నిప్రమాదం  సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

సౌదీ అరేబియాలో ‘అనంత’ వాసి మృతి

అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…

సమాధాన పత్రాల కుంభకోణం విచారణకు కమిటీ

హైదరాబాద్‌: సమాధాన పత్రాల కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు కమిటీని నియమిస్తున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ రయణారావు తెలిపారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న విద్యార్థులను డీబార్‌ చేస్తామన్నారు. దీనిలో ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రమేయముంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామన్నారు.

సౌదీ అరేబియాలో ‘అనంత’ వాసి మృతి

అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…

ఆటో బోల్తా : 14 మందికి గాయాలు

మునగోడు : నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో గురువారం ఉదయం ఆటో బోల్తా పడిన సంఘటనలో 14 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పత్తి తీసేందుకు చిట్యాల మండలం నేరడ నుంచి మునుగోడు…

రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్‌ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్‌ పోటీలు ఈరోజు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజల పాటు కొనసాగే ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన జట్లకు శుక్రవారం…