Monday, 16 November 2026

హైదరాబాద్

తెలంగాణ ఏర్పాటుకు అఖిలపక్షమే చివరి సమావేశం కావాలి

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశమే చివరిది కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అఖిలపక్షం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. హన్మకొండలో పర్యాటక…

గాలి బెయిల్‌ ముడుపుల కేసు విచారణ 24కు వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసు విచారణను ఏసీబీ కోర్టుఈ నెల 24కి వాయిదా పడింది. ముడుపుల కేసు విచారణ నిమిత్తం గాలి జనార్ధన్‌రెడ్డిని తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటిించారు.

అఖిలపక్షానికి ఎవరిని పంపాలో నిర్ణయిస్తాం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణపై ఈనెల 28న జరిగే అఖిలపక్షానికి ఎవరిని పంపాలో అనే విషయంపైఈనెల 22, 23న కరీంనగర్‌లో నిర్ణయిస్తామని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. డెడ్‌లైన్లు పెట్టే అధికారం ఐకాసకు లేదని ఎర్రబెల్లి అన్నారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలతో పీసీసీ చీఫ్‌ భేటీ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ నెల 16న జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంపై ఈ భేటీలో చర్చిస్తారు.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: మార్కెట్‌లో ఈ రోజు బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ. 31,440, 22 క్యారెట్ల బంగారం 29,450, వెండి కిలోరూ. 61,750గా ఉంది.

ఎమ్మార్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ విచారణ

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఈరోజు విచారణ చేపట్టింది.దీనికి ఎమ్మార్‌ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసులో త్వరగా కౌంటర్‌ దాఖలు చేసి ఈడీకి అందించాలని ఎమ్మార్‌ను న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది.  సంస్థ ఆదేశాల మేరకు ఎమ్మార్‌…

సుప్రీంలో ములాయంకు చుక్కెదురు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ములాయం అక్రమంగా అస్తులు సమకూర్చుకున్నారని వచ్చిన  అభియోగాలపై సీబీఐ విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది.…

ములాయంపై విచారణ కొనసాగుతుంది: సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఆస్తుల కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణను సవాలు చేస్తూ ములాయం దాఖలుచేసిన  పిటిషన్‌ను ధర్మాననం తోసిపుచ్చింది. ఈకేసులో…

సీఎంతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ముగ్గురు మంత్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు భేటీ అయ్యారు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌ ఉన్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌ టెస్టులో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఈ సిరీస్‌లో అద్భుతఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ కుక్‌ (1) జట్టుస్కోరు 16 పరుగుల వద్ద ఇషాంత శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.