Monday, 16 November 2026

హైదరాబాద్

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…

2014 ఎన్నికల్లో అన్నిస్థానాల్లో కేజ్రీవాల్‌ పార్టీ పోటీ

సంభాల్‌: అవినీతి వ్యతిరేకోద్యమ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించబోయే పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని  ఆయన బృందంలోని కీలకసభ్యుడు ఒకరు వెల్లడించారు. కుమార్‌ విశ్వాస్‌ అనే ఆ సభ్యుడు బుధవారంరాత్రి సంభాల్‌లో మీడియాతో…

10కెరన్‌కు ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్‌లో ఈ నెల 25న నిర్వహించే 10కెరన్‌ పోటీల కోసం నిర్వాకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పరుగులో పాల్గొనే క్రీడాకారుల కోసం పీపుల్స్‌ప్లాజాలో స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిని ప్రముఖ మోడల్‌ ఉజ్వలారౌత్‌ సందర్శించారు. ఈ పోలీల్లో …

స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఉత్తర తెలంగాణ టీచర్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే పరిగణిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన బీజేపీ సీనియర్‌…

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌: కన్నా

అనంతపురం : ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలియజేశారు. రైతు రుణాలను మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం లేదని ఆయన వెల్లడించారు.

పాడేరు భారతీ ఆశ్రమ స్వామీజీపై కేసు నమోదు

విశాఖపట్నం: పాడేరులోని భారతీ ఆధ్యాత్మిక ఆశ్రమం స్వామిజీ కీర్తి దయానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దయానంద అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ తొలగింపు

గుంటూరు: గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి నుంచి సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డిని అధికారులు తొలగించారు. సత్తెనపల్లిలో గ్రంథాలయ భవనం లీజులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అయన్ని తొలగించినట్లు అధికారులు తెలియజేశారు.

కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ మండలిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలుష్యం భారీగా  వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు…

57 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్‌ గురువారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 56.96 పాయింట్ల లాభంతో 18517.34 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.95 పాయింట్ల ఆధిక్యంతో 5627.75 వద్ద స్థిరపడ్డాయి.ఐటీసీ, ఇన్ఫోసిన్‌, ఎల్‌ అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు…

గాలి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై గురువారం సాయంత్రం సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వాదోపవాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 26కి వాయిదా వేసింది.