Sunday, 15 November 2026

హైదరాబాద్

మహీంద్రా సంస్థకు ప్రచారకర్తగా మహేశ్‌బాబు

హైదరాబాద్‌: ట్రాక్టర్ల తయారీలో పేరొందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకునేందుకు సిద్థమైంది. ఇందుకు ప్రిన్స్‌ మహేశ్‌ బాబుని ట్రాక్టర్‌ ఉత్పత్తులకు ప్రచార కర్తగా నియమించుకుంది. రెండేళ్ల కాలపరిమితికి గాను మహేశ్‌ ఈ…

ఈ నెల 26 పీసీసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 26న ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమీటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ , జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇతర…

గ్రూప్‌-1 ఫలితాలు ప్రకటించవద్దు: ఏపీపీఎస్సీని ఆదేశించిన రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించవద్దని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఆదేశించింది. గ్రూప్‌ -1 కీలో తప్పులున్నాయన్న పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా కమిషన్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణను ట్రైబ్యునల్‌ వచ్చే…

పాల్వంచలో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ 11వ యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సాంకేతికలోపం తలెత్తడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలియజేశారు.

త్వరలో తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం, తెలంగాణ సమస్యపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీలు చర్చించినట్టు వార్తలొస్తున్నాయి.

సచివాలయంలో లగడపాటికి తెలంగాణ షాక్‌

హైదరాబాద్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మరోసారి తెలంగాణ షాక్‌ తగిలిందిజ సచివాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతుండగా రమేష్‌ అనే తెలంగాణ యువకుడు లగడపాటిని నిలదీశారు. ‘ తెలంగాణ భూములను కొల్లగొడుతూ, తెలంగాణనే అడ్డుకుంటావా’ అని…

బ్రహ్మానంద రెడ్డి బెయిల్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రకమాస్తుల కేసులో కె.వి బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వచ్చేనెల ఐదో తేదీకి వాయిదా వేసింది.

వరంగల్‌లో 20 కొత్త బస్సులు ప్రారంభం

వరంగల్‌: బీసీ సంక్షేమ శాఖమంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్‌ బస్‌స్టేషన్‌లో 20 కొత్త బస్సులను ప్రారంభించారు. నానాటికి పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు మంత్రి తెలియజేశారుజ వరంగల్‌ నుంచి తిరుపతి,…

సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల నగదు నిల్వలు జప్తు

హైదరాబాద్‌: సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల స్థిర నగదు నిల్వలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు నిల్వల జప్తు ఈడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈడీ జప్తు నగదు నిల్వలన్నీ మహీంద్రాసత్యం…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,470,22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 30,300గా నమోదైంది. కిలో వెండి ధర 60,500 గా ఉంది.