Saturday, 14 November 2026

హైదరాబాద్

బంగ్లాదేశ్‌ విజయలక్ష్యం 192 పరుగులు

కండె: టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మూడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ ముందు 192 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. న్యూజిలాండ్‌ జట్టులో…

గన్నవరం నుంచి ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట

విజయవాడ: ఈ నెల 25 నుంచి 27 వరకు కృష్ణా జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట నిర్వహించనున్నట్లు మంత్రి పార్ధసారథి ప్రకటించారు.  కృష్ణాజిల్లా గన్నవరం మండలం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట ప్రారంభిస్తారని మంత్రి తెలియజేశారు.

ఆరుగురు తృణమూల్‌ మంత్రులు రాజీనామా

ఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌కి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు ఈరోజు సాయంత్రం ప్రధానికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాసేపటి క్రితమే ప్రధానితో భేటీ అయిన వారు రాజీనామా పత్రాలు సమర్పించారు. అక్కడినుంచి వారు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని…

బీజేవైఎం నేతల అరెస్టు

హైదరాబాద్‌: విద్యార్ధులకు ఫిజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ(బీజేవైఎం) డిమాండ్‌ వ్యక్తం చేసింది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పై ప్రభుత్వం విధించిన షరతులకు నిరసనగ     బీజేవైఎం ఈరోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా…

అంతర పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం

  నాగిరెడ్డీపేట మండలంలొని అత్మకూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినఅంతర్‌ పాఠశాలల క్రీడోత్సవాలను శుక్రవారం డిప్యూటి డీఈఓ సాంబశివరావు ప్రారంభించారు. జాతీయ జేండాను ఎగురవేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించాను.

ప్రత్యేక వైద్య శిభిరాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

ధర్మారం మండలంలోని మేడారం పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ స్మితసబర్వాల్‌ ప్రారంబించారు. కరీంనగర్‌లోని ప్రతిమ యాజమాన్యంతో గతవారం క్రితం పర్యటన సందర్బంగా చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతిమ అసుపత్రి సహకారంతో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.…

రైలునుంచి పడి యువకునికి తీవ్ర గాయాలు

  జమ్మికుంట గ్రామీణం జమ్మికుంట మండలం విలా సాగర్‌ గ్రామ సమీపంలో రైలునుంచి పడి 20ఏళ్ల గుర్తు తెలియని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి తలకు తీవ్ర గాయాలుకాగా జమ్మికుంటలోని ప్రభుత్వ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి అందోళనకరంగా…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

కండె: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా  గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌,బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

పరిశ్రమలకు విద్యుత్‌ కోతలపై హైకోర్ట్‌లో పిటిషన్‌

హైదరాబాద్‌: పరిశ్రమలకు విద్యుత్‌ వాడకాన్ని పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీసీపీడీసీఎల్‌ను ఆదేశించింది.

ఎడ్లబండిని డీకోన్న లారీ స్తంబించిన రాకపోకలు

  పరిగి ఎడ్లబండిని లారీ ఢీకోనడంతో పరిగి, మహబూబ్‌నగర్‌ మార్గంలో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన పరిగి పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌, రాఘవపూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. దీంతో ఒక కాడెద్దు అక్కడికక్కడే చనిపోగా…