Saturday, 14 November 2026

హైదరాబాద్

సీఎంపై లోకాయుక్త అసంతృప్తి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో తల పెట్టిన రాజీవ్‌ స్వగృహ, ఇందిరమ్మఇళ్ల స్థలాల కేటాయింపులో జరుగుతున్న ఆలస్వానికి రాష్ట్ర లోకాయుక్త ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను సంబంధించిన ఫైల్‌ను ఎలాంటి పురోగతి లేకుండా దీర్ఘకాలం ఎలా అట్టిపెట్టుకుంటారని…

‘వనదీక్ష’లో రచ్చకెక్కిన విభేదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. మెట్రో రైలు వనదీక్ష కార్యక్రమాన్ని శనివారం పార్లమెంటు సభ్యులు మంత్రి మహీధరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సర్వే సత్యనారాయణ,ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం…

ముగిసిన బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌

కర్ణాటక : బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి శాంత 2,243 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంత గెలుపును రిటర్నింగ్‌ అధికారిధికారికంగా ప్రకటించలేదు.

తెలంగాణ మార్చ్‌ చేసి తీరుతాం: టీజీవో అథ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: ఎంత మందిని అరెస్టు చేసినా సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ నిర్వహించి తీరుతామని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం అరెస్టులతో తెలంగాణ మార్చ్‌ను ఉద్యమకారులను అడ్డుకోవాలనడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు.

టీ-20 వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు

కొలంబో: టీ-20 వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన  భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక శ్రీలంక 120 పరుగులకే ఆలౌట్‌ అయింది.

పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి

వికారాబాద్‌: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

మంత్రి కుమారుడి కారు స్వాధీనం

హైదరాబాద్‌: మద్యం తాగి వాహనం నడుపుతున్న మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణను పోలీసులు పట్టుకున్నారు. ఆయన కారును బంజార్‌హిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని అడ్డుకున్న టీజీవీపీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అడ్డుకుంది. ఈ నెల 30న నిర్వహించే తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలనే డిమాండ్‌తో బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీజీవీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి…

సమస్యల్లో చేనేత కార్మికులు: ముఖ్యమంత్రి

మహబూబ్‌నగర్‌: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్‌ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

తెలంగాణ వాదులను విడుదల చేయాలి: జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌: పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు తమకు  ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి ఉందని ఆయన తెలియజేశారు.…