Saturday, 14 November 2026

హైదరాబాద్

డీజిల్‌ ధరను తగ్గించాలి: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: పెరిగిన డీజిల్‌ ధరలతో రైతుపై మరింత ఆర్థిక భారాన్ని మోపి నట్లైందని భాజపా నేత వెంకయ్యనాయుడు అన్నారు. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సామాన్య మానవుని వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17నుంచి…

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన కె. పద్మ గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆమె భర్త శంకర్‌ ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తండ్రి ఇద్దరు…

అన్‌లైన్‌లో ఎంసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపింది. ఈ నెల 20లోపు కాళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాలని సూచిందింది.

అన్నదమ్ముల మధ్య భూవివాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం పనుమాములు వద్ద అన్నదమ్ములైన అతన్‌బాయ్‌, ఫారూక్‌ల  మధ్య 200 ఎకరాలకు సంబంధించి భూవివాదం తలెత్తింది. ఇరువర్గాల వారు కత్తులు, రివాల్వర్లతో  పరస్పర దాడులు చేసుకుని రెండు కార్లకు నిప్పంటించారు.

తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో 17న సన్నాహక మోటారు సైకిల్‌ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస ఇచ్చిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ న్యాయవాదుల ఐకాస సన్నాహక మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీ ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు, నాంపల్లి కోర్టు నుంచి ప్రారంభమై నగరంలోని అన్ని…

కొత్త భూకేటాయింపు విధానంపై జీవో జారీ

హైదరాబాద్‌: నూతన భూకేటాయింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భూకేటాయింపు విధానం జీవో నంబర్‌ 571ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను నిశితంగా పరిశీలించిన తర్వాతే భూకేటాయింపులు జరగనున్నాయి. తొమ్మిది శాఖలకు …

జై ఆంధ్ర ఉద్యమని కొనసాగిస్తామం: వసంత

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలో జైఆంధ్రా జేఏసీ తల పెట్టిన బహిరంగసభ ఉద్రిక్తతలకు దారితీసింది. బహిరంగసభ కోసం ర్యాలీగా బయలుదేరిన జేఏసీ గౌరవ అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావును పోలీసులు జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ర్యాలీలోని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…

చిన్నారి అపహరణకు యత్నం

విశాఖ: విశాఖపట్నం కేజీహెచ్‌ పిల్లల వార్డులో చిన్నారిని అపహరించేందుకు ముగ్గురు సభ్యులముఠా యత్నించింది. ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు మహిళలు,ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బొగ్గు కేటాయింపుల పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: కాగ్‌ నివేదికపై ఆధారపడటంలో తప్పులేదని, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్రం వివరణ అవసరమని తెలియజేశారు.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటివరకూ దాఖలు…