Friday, 13 November 2026

హైదరాబాద్

జీవ వైవిధ్యంపై అవగహాన ర్యాలీ

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, భూపరిపాలన శాఖ కమిషనర్‌ శ్యాముల్‌ తదితరులు హాజరయ్యారు.…

సీమాంధ్ర నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి స్పష్టత ఇచ్చే అంశంపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, కోడెల, సోమిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

చైనాలో భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య 80

బీజింగ్‌: చైనాలో చోటుచేసుకున్న వరస భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య 80కి చేరింది. ఏడు వందల మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా సరిహద్దులో యన్నవ్‌, గైజా ప్రాంతంలో నిన్న వరస ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటిలో…

అన్నదమ్ముల దారుణహత్య

గుంటూరు: నగరంలోని శ్రీనివాసరావు పేట అరవై అడుగుల రోడ్డులో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు అన్నదమ్ములు దారుణహత్యకు గురయ్యారు. దుండగులు వీరిని కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమైఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

వీహెచ్‌ ఆధ్వర్యంలో నేడు మేధోమథన సదస్సు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు నేడు జూబ్లీహాల్లో ఉదయం 10 గంటలకు జరగనుంది. పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు పీసీసీ మాజీ ఆధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపౌ నేతలు చర్చించనున్నారు.

గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి

మహదేవ్‌పూర్‌: ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం రాత్రి 10.66 మీటర్లు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 10.78 మీటర్లకు చేరుకొంది. నీటి మట్టం…

నేడు భారత్‌-పాక్‌ విదేశాంగ శాఖ మంత్రుల భేటీ

ఇస్లామాబాద్‌: భారత్‌-పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రుల భేటీ నేడు ఇస్లామాబాద్‌లో జరగనుంది. భారత్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ,పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి హీనారబ్బానీఖర్‌ల మధ్య జరిగే భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరగనుంది. మరోవైపు భారత్‌,…

భారత్‌, కివీస్‌తో తొలి టీ 20 మ్యాచ్‌ నేడు

విశాఖ: భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టీ 20 మ్యాచ్‌ నేడు విశాఖలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు విశాఖలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌  ప్రారంభం కానుంది.

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…