Wednesday, 11 November 2026

హైదరాబాద్

పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు: కిరణ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం ప్రసంగించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని…

జాతీయపతాకంను ఎగురవేసిన 111 ఏళ్ల వృద్ధుడు

మెదక్‌: మెదక్‌ జిల్లా మనూరు మండలం దామరగిద్ద గ్రామంలో 111 సంవత్సరాల వృద్ధుడు మల్కప్ప స్ధానిక చర్చి ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని పూర్తి పెద్దమనిషిగా ఆయనకు గౌరవమిస్తూ స్థానికులు ఆయన చేత పతాకావిష్కరణ…

రసాయన పరిశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెటిరోడ్రగ్స్‌ పక్కన ఉన్న ఓ రసాయన పరిశ్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. దీంతో నర్సాపూర్‌ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి.

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినితీ పెరిగిపోయిందని ఆరోపించారు. వెనకబడిన కులాల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ తరపున ఆపార్టీ   సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  నాయిని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 66 సంవత్సరాలు అయినా…

ముళ్లు వేసిన భర్తనే హత్య చేసిన భార్య

హైదరాబాద్‌: మూడు ముళ్లు వేసిన భర్తనే ఓ భార్య హత్య చేసింది. నిదిస్త్రున్న భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పటించింది. ఈ ఘటన మూసాపేటలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

స్టీమ్‌కోర్‌ పరిశ్రమంలో పేలుడు. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: పట్టణ శివారులోని స్టీమ్‌కోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలియజేశారు.

మండలి ఆవరణలో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని  ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో ధర్మాన భేటీ

హైదరాబాద్‌: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడే ధర్మాన మంత్రి గంటా శ్రీనివాసరావుతో కాసేపు భేటీ…

రాజధానిలో పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌  పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, నాంపెల్లి, సికింద్రబాద్‌ రైల్వేస్టేషన్‌లు, ఎంజీబీఎన్‌లో తనిఖీలు…