Wednesday, 11 November 2026

హైదరాబాద్

వృత్తి విద్యా కళాశాలలపై నియంత్రణ సరికాదు

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలలపై  నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ను వ్యతిరేకిస్తున్నామని కళాశాలల   యాజమాన్యాల సంఘం ప్రతినిధి కె.వి.కె. రావు పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగే తుది దశ చర్చల్లో బోధనా రుసుంపెంపుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు …

కాలేజీ యాజమాన్యాలతో మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: కళాశాల యాజమాన్యాలతో మరికాసేపట్లో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. బోధనా రుసుము. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలపై  ఈ సమావేశానంతరం ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ప్రైవేటు బస్సులో బోల్తా.. 40 మందికి గాయాలు

హిందూపురం: అనంతపురంలో జిల్లా హిందూపురం నుంచి వెంకటపురం గ్రామానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో…

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని అంబార్‌పేటలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 90 వేల రూపాయల నకీలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

భార్యను గొంతుకోసి చంపిన భర్త

హనుమాన్‌ జంక్షన్‌: వివాహేతర సంబధాన్ని నిలదీసినందుకు ఓభర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసించే సురేష్‌బాబుకు బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన గౌరినేని…

బాంబు కాల్‌తో విజయవాడ బస్టాండులో విస్తృత తనిఖీలు

విజయవాడ: నెహ్రు ఆర్టీసీ బస్టాండులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడి ఫోన్‌ కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్‌స్క్వాడ్‌తో రంగంలోకి దిగి బస్గాండ్‌లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

ఆసుపత్రిలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

విశాఖ: విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఇందోళనకు దిగారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నాట్లు ఆరోపించారు.

నేడు టీడీపీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశం కానున్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

ఆటో ఢీకొని చిన్నారి మృతి

వీరబల్లి: కడప జిల్లా వీరబల్లి మండలంలో మక్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు. సంతోష్‌ (2) రోడ్డుపై ఆటాడుకుంటుండగా ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆటో-లారీ ఢీ. ఐదుగురు మృతి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం చొల్లంగి వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యానం నుంచి కాకినాడ వెళ్తున్న టిప్పర్‌. చొల్లంగి …