Tuesday, 10 November 2026

హైదరాబాద్

కరీంనగర్‌ కలెక్టరేట్‌ కు విద్యుత్‌ నిలిపివేత

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి గురువారం విద్యుత: సరఫరా నిలిపివేశారు.దీంతో ఒక్క సారిగా కలెక్టర్‌ కార్యలయం అంధకారంగా మారింది.పూర్వపు బకాయిలు చెల్లించ లేదని విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ను నిలిపి వేశారు.

ఏసీబీకి చిక్కిన తాసీల్డారు

వరంగల్‌: చౌకధరల దుకాణ డీలర్‌ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నరసింహులు పేట తాసీల్దారు సమ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్నారు.

ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌పై సీబీఐ విచారణ

చైన్నై: ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సన్‌టీవీ ఎండీ, మాజీ కేంద్ర మంత్రి దయానిధిమారన్‌, అతని సోదరులను సీబీఐ విచారించింది. సీబీఐ అధికారులు వారిపై ప్రశ్నల పరంపర కురిపించారు.

ఎస్టీవో పై లైంగిక వేధింపుల ఆరోపణ

విశాఖపట్నం: తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఓ అపర కీచకుడిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఎస్టీవోగా పనిచేస్తోన్న చందర్‌రావు అనే ఉద్యోగి తనను లైంగికంగా వేదిస్తోన్నాడంటూ గీతాదేవి అనే మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.…

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌  కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ గాలి సోమశేఖర రెడ్డి, కంప్లి ఎంఎల్‌ఏ సురేష్‌బాబులు దాఖలు చేశారు. ఈ మేరకు వారు ఏసీబీ కోర్టులో వీటిని సమర్పించారు.

ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారధి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రి పార్థసారధి భేటీ అయినారు. ఈ సమావేశంలో రాజీనామ అంశంపైన చర్చిస్తున్నట్లు సమాచారం. శిక్షవిషయంలో పై కోర్టుకు వేళ్లేందుకు న్యాయమూర్తితో మంత్రి అనుమతి తీసుకున్నారు. అయితే ఇప్పటికే రాజకీయా పార్టీలు మంత్రి పదవికి…

వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నపం

హైదరాబాద్‌:  ఈ రోజు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కలిశారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించింది.  రాయలసీమలోని రెండు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాడాన్ని ఖండించారు. తిరుపతి ఎయిర్‌ పోర్టు…

ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్‌

వరంగల్‌ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

ధర్మాన కమీటీ నివేదికను సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : మంత్రి ధర్మాన ప్రసాదరావు కమీటీ నివేదికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ సమీక్షించారు. కమిటీ చేసిన సిఫారసులపై పరిష్కరాలతక్ష ముందుకుయ రావాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు వీలుగా కోర్టు…

బాలుడిని చితకబాదిన వార్డెన్‌

హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పరిధిలో నందనవనం కాలనీలో లివింగ్‌ హోవ్‌ హాస్టల్‌లో  3వ తరగతి చదువుతున్న మహేష్‌ అనే విద్యార్థిని ఆ హాస్టల్‌ వార్డెన్‌ చితకబాదడంతో బాలుడి తల్లిదండ్రులు వార్డన్‌పై మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో టేబుల్‌పై ఉన్న…