పశ్చిమగోదావరి: జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. బస్సు ఆపి విద్యార్థుల్ని దించడంతో ముప్పు తప్పింది. ఆచంట మండలం కొండమంచిలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.




