Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఆటో బోల్తా: ఒకరు మృతి…

గుంటూరు:కూలీలతో వెళ్తున్న ఆటో ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటన వినుకొండ మండలం వెంకుపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వెల్లటూరుకు చెందిన అద్దాలపూడి వెంకటసుబ్బయ్య(60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా  మరో…

తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నక్సల్స్ కలకలం

తూర్పుగోదావరి: జిల్లాలో నకిలీ నక్సల్స్ కలకలం రేపారు. ద్వారపూడి, రామచంద్రాపురంలో వీరు వ్యాపారుల నుంచి డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంలో పోలీసులు… 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

ధర్మవరంలో పట్టుబడ్డ దొంగల ముఠా

అనంతపురం: జిల్లాలోని ధర్మవరంలో వివిధ చోరీ కేసుల్లో నిందితులైన ఆరుగురు దొంగలు ఉన్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.20 లక్షల విలువ చేసే బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గుంటూరు జిల్లావాసులని…

తిరువూరు శ్రీరామ్ చిట్స్ ఖాతాదారుల ఆందోళన

కృష్ణా: తిరువూరు శ్రీరామ్ చిట్స్ లో గోల్ మాల్ అయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో వినియోగదారులకు చెల్లించాల్సిన రూ.60 లక్షల నగదును సిబ్బంది వాడుకున్నారు. గడువు ముగిసినా నగదు చెల్లించకపోవడంతో శ్రీరామ్ చిట్స్ వద్ద ఖాతాదారులు ఆందోళన చేపట్టారు.

ఎన్ కౌంటర్ లో గాయపడిన పోలీసులను హైదరాబాద్ కు తరలింపు

హైదరాబాద్:నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఐలు, గంగారాం, బాల గంగిరెడ్డికి, ఎస్సై సిద్ధయ్య, మరొక కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్…

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:ముగ్గురి మృతి

కర్నూలు:జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురంలో వేగంగా వస్తున్న ఓ లారీ తూఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి . మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన…

మర్రివాడలో పేకాట రాయుళ్లు అరెస్టు

తూర్పు గోదావరి: రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో పేకాట శిబిరంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదుతోపాటు మూడు బైకులు స్వాధీనం…

అనంతపురంలో కారు బోల్తా పడి ఇద్దరు మృతి

అనంతపురం: నగర శివారులోని రుద్రంపేట బైపాస్ రోడ్డుపై ఇండికా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పెనుగొండలోని బాబా దర్గాను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ అజీమ్(35) అక్కడిక్కడే…

సత్తెనపల్లి మండలంలో వద్ద పెళ్లి ఆటో బోల్తా…..

గుంటూరు:సత్తెనపల్లి మండలం నందిగాం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద పెళ్లి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మోతాదుకు మించి ఆటోలో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా…

శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు….

చిత్తూరు:శేషాచల అడవుల్లో కరకంబాడి వద్ద కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటలు సమీప గ్రామాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.