కర్నూలు:జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురంలో వేగంగా వస్తున్న ఓ లారీ తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి . మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




