Wednesday, 25 November 2026

సీమాంధ్ర

చీరాలలో తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం…

ప్రకాశం:చీరాల కొత్తపేటలో తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. చీరాల టూటౌన్ పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకున్నారన్న మనస్తాపంతో వారు ఈ ఘాతుకానికి వడిగట్టారని స్థానికుల సమాచారం.

పారిశ్రామికంగా ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు

  తిరుపతి:పారిశ్రామికంగా ఏపీని నెంబర్ వన్ చేస్తాంమని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు. సత్యవేడు శ్రీసిటీ సెజ్ లో 11 దేశ, విదేశీ కంపెనీలకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెప్సీకో తమ ఉత్పత్తులకు…

ఎన్టీఆర్ బీచ్ కు రూ.50కోట్లు

తూర్పుగోదావరి:కాకినాడ వాకలపూడి సమీపంలోని ఎన్టీఆర్ బీచ్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర టూరిజం శాఖ రూ.50.76 కోట్ల నిధులు మంజూరు చేసిందని టీడీపీ ఎంపీ తోట నరసింహం తెలిపారు.

10లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్:చంద్రబాబు…

చిత్తూరు:నవ్యాంధ్రలో నూతన పరిశ్రమల కోసం 10లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. కడప జిల్లాకు పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయని…. ఇసుక ద్వారా రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.

తణుకులో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

 పశ్చిమగోదావరి : జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొన్న ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. తెనాలి నుండి విశాఖపట్టణం వెళుతున్న (ఎపి07 జెడ్ 0086) ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీనితో ఆర్టీసీ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయైంది.…

బైక్ – వ్యాన్ ఢీ..దంపతులు మృతి..

విశాఖపట్టణం : మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెంలో ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులు కశింకోట మండలం అడ్డాం వాసులుగా గుర్తించారు.

శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం..

శ్రీకాకుళం : జిల్లా సీతంపేట మండలం కె.గుమ్మడ వద్ద ఏనుగులు పంట పొలాలపై దాడులు చేశాయి. జీడితోటలోని పాక, సామాగ్రిని ఏనుగులు ధ్వంసం చేశాయి. దీనితో రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.