Tuesday, 24 November 2026

సీమాంధ్ర

శ్రీశైలం ఆలయ సూపరిటెండెంట్‌ సస్పెన్షన్‌

శ్రీశైలం : శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయం సూపరిటెండెంట్‌ రాధాకృష్ణపై ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ సస్పెన్షస్‌ వేటు వేశారు. రోజూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న కారణంగా ఆయనను సస్పెన్షస్‌ చేసినట్లు ఈవో తెలిపారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడ్డాయి.

క్రికెట్‌ బెట్టింగ్‌ వివాదంతో వ్యక్తి హత్య

కృష్ణాజిల్లా : విజయవాడ పట్టణంలో ఈనెల 19న న్యూరాజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ నన్నె మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. బలమైన గాయాలు కావడంతోనే నన్నె మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌…

పాత్రికేయుడి హత్యకేసులో నలుగురి అరెస్టు

గూంటూరు జిల్లా జనంసాక్షి: పెదకాకాని సమీపంలో జరిగిన పాత్రకేయుడు ప్రకాష్‌ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుల్లో ఈరోజు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు అర్బన్‌ రవికృష్ణ తెలిపారు.

పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరు మృతి

ప. గో. జిల్లా, జనంసాక్షి: కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద బృందంతో వెళ్తుదన్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందాగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను…

కారు-బైక్‌ ఢీ: ముగ్గురి మృతి

తూర్పుగోదావరి జిల్లా, జనంసాక్షి: తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలం రాజపూడి వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం .

జగన్‌ విడుదల కోసం ప్రత్యేక పూజలు !

ఆలూమూరు, జనంసాక్షి: జగన్‌ ,జైలు నుంచి విడుదల కావాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలుమూరు మండలం జొన్నాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్‌ విడుదల కోసం జగ్గిరెడ్డి చేపట్టిన యాత్రకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు సాయిబాబా గుడిలో…

టీటీడీ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టిన లెక్చరర్లు

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని తప్పుబడుతూ కాంట్రాక్టు లెక్చరర్లు ధర్నాకు దిగారు. టీటీడీ నిర్వహిస్తున్న డెమో పరీక్షలు వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. డెమో పరీక్షను నిర్వహించడానికి టీటీడీ సిద్ధమవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు.

రౖలు ఢీకొని ఇద్దరి మృతి

ఆముదాలవలస, జంనసాక్షి: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు . పట్టాలు దాటుతున్న సమయంలో రైలు రావడాన్ని వారు గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

తాళం వేసి ఉన్న ఇల్లు లూటీ

కొత్తపేట , జనంసాక్షి: తూర్పుగోదావరి కొత్త మండలం కమ్మిరెడ్డిపాలెం సమీపంలో గల గౌతమీ పాఠశాల పక్కన ఎరువుల వ్యాపారి ఖాలందరి షరీఫ్‌ నివాసముంటున్నాడు ఆయన కుంటుబసభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లివచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లో బీరువాలోని…