కృష్ణాజిల్లా : విజయవాడ పట్టణంలో ఈనెల 19న న్యూరాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ నన్నె మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. బలమైన గాయాలు కావడంతోనే నన్నె మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వివాదం నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.




