చౌకబియ్యం పట్టివేత
రేపల్లె, జనంసాక్షి: గుంటూరు జిల్లా రేపల్లెలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల చౌకబియ్యాన్ని ఈ రోజు ఉదయం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేశారు.
రేపల్లె, జనంసాక్షి: గుంటూరు జిల్లా రేపల్లెలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల చౌకబియ్యాన్ని ఈ రోజు ఉదయం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేశారు.
నక్కలపల్లి, జనంసాక్షి: కడప నక్కలపల్లిలో నాపరాయి లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
నెల్లూరు, జనంసాక్షి: జిల్లాలోని కొండాపురం మండలం పర్లపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయింది. గుడిసెకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగింది.
కడప జల్లా : కడప జిల్లా బనగానపల్లెలో ట్రాన్స్‌కో ఏఏవో బాలసుబ్రహ్మణ్యం రూ.27 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. సెక్యూరిటీ గార్డుల జీతాల బిల్లులు చేయడానికి గుత్తేదారు నుంచి బాలసుబ్రహ్మణ్యం డబ్బులు డిమాండ్…
విజయవాడ, జనంసాక్షి: రాజకీయాల్లో డబ్బు ప్రధానమని.. అయితే డబ్బే రాజకీయం కాదని టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ తరపున ఎంపీ సీటు ఇస్తే తేను డబ్బు ఖర్చు పెడతానని…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, విజయవాడ : 2013-14 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్) ప్రవేశాలకు సంబంధించి మార్చి 17న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విజయ వాడలోని డాక్టర్ ఎన్టీఆర్…
కావలి, జనంసాక్షి: 20వేల రూపాయలకు పసికందును అమ్మకానికి పెట్టిన నెల్లూరు జిల్లా కావలిలో కలకలం సృష్టించింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన మున్నా, దస్తగిరమ్మ దంపతులకు ఇలీవలే మగబిడ్డ జన్మించాడు. బిడ్డను అమ్ముకోవాలనుకున్న ఆ దంపతులు….. చిన్నారికి తల్లి చనిపోయిందని…
విజయవాడ : మంత్రి పార్థసారథి ఎన్నికల అఫిడవిట్ కేసు విచారణ వచ్చే నెల 14కు వాయిదా పడింది. మంత్రి పార్థసారధి ఎన్నికల అఫిడవిట్ కేసు విచారణను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వాయిదా వేసింది.
కడప : కడప జిల్లా వేముల మండలంలో చేపట్టే యురేనియం ప్లాంటు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల బృందం పర్యటిస్తోంది. ప్రజలతో సమావేశమైన ఈ బృందం యురేనియం కర్మాగారం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరిస్తోంది. యురేనియం కర్మాగారానికి వ్యతిరేకంగా…
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్టాండ్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి బుధవారం ఉదయం 22 కాసుల బంగారాన్ని దుండగులు అపహరించుకుపోయారు. దీంతో బాధితురాలు పట్టణ పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.