కొత్తపేట , జనంసాక్షి: తూర్పుగోదావరి కొత్త మండలం కమ్మిరెడ్డిపాలెం సమీపంలో గల గౌతమీ పాఠశాల పక్కన ఎరువుల వ్యాపారి ఖాలందరి షరీఫ్ నివాసముంటున్నాడు ఆయన కుంటుబసభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లివచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లో బీరువాలోని 30 కాసుల బంగారం, 4 కేజీల వెండి చోరికి గురయినట్లు తెలుసు కున్నారు. ఈ సంఘటనపై కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




