Tuesday, 24 November 2026

సీమాంధ్ర

అల్లూరి విగ్రహ ఏర్పాటులో విఫలమైన టీడీపీ

విశాఖపట్నం, జనంసాక్షి: పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటులో టీడీపీ విఫలమైందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. విగ్రహ ఏర్పాటుకు పార్లమెంట్‌ అనుమతిచ్చినా టీడీపీ స్పందించలేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.…

మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రత్యేక టాన్క్‌ఫోర్స్‌

కర్నూలు: మహిళలపై వేధింపుల నిరోధానికి చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఇందుకోసం సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ఆయన చెప్పారు.

వైఎస్సార్‌తో బాబుకు పోలిక లేదు:ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం, జనంసాక్షి:  వైఎస్సార్‌ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు…

అక్రమంగా తరలిస్తున్న 3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు, జనంసాక్షి: అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. రేణిగుంట చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించారు. లారీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో దగ్గరలోని గాజుల మండ్యం…

మూడు లారీలు ఢీకొని ఒకరి మృతి

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద ఈ ఉదయం మూడు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళన

గుంటూరు: చోరీ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని నకిరికల్లు పోలీసుస్టేషన్‌ ఎదుట బాధితుడి బంధువులు అందోళనకు దిగారు. దీంతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

తిరుపతిలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహావిష్కరణ

తిరుపతి, జనంసాక్షి: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌, మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహాలను  లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై వేధింపులు. అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. కఠినమైన చట్టాలు రావలసిన…

కృష్ణానదిలో స్నానానికి వెళ్లి యువకుల దుర్మరణం

గుంటూరు, జనంసాక్షి: కృష్ణానదిలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆ ఇద్దరు యువకులు అమరావతి వద్ద నదిలో దిగి నీటిలో మునిగిపోయారు.

దుర్గమ్మను దర్శించుకున్న భన్వర్‌లాల్‌

విజయవాడ, జనంసాక్షి: ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మే 15 నుంచి జూన్‌ 15 వరకు ఓటర్ల జాబితా సవరణలు చేస్తామని చెప్పారు.

ఏనుగుల బీభత్సం

చిత్తూరు, బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. పంటలు, తోటలు భారీగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు భయంతో గ్రామం వదిలివెళ్లిపోయారు.