చిత్తూరు, జనంసాక్షి: అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. రేణిగుంట చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో దగ్గరలోని గాజుల మండ్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ పోలీసులు లారీని ఆపేందుకు ప్రయత్నించగా వారిపై నుంచి తీసుకెళ్లి హతమార్చేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పుడే అక్కడకు చేరుకున్న ఎస్సై స్మగ్లర్లపై కాల్పులు జరిపాయి. ఎర్రచందనం ఉన్న లారీని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.




