విశాఖపట్నం, జనంసాక్షి: వైఎస్సార్ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు వచ్చిన వారంతా తెచ్చిన జనమేనని, స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. కేంద్రలో కాంగ్రెస్ మినహా ఇతర ఏ పార్టీ సీబీఐని విశ్వసించటం లేదన్నారు.




