విశాఖపట్నం, జనంసాక్షి: పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటులో టీడీపీ విఫలమైందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. విగ్రహ ఏర్పాటుకు పార్లమెంట్ అనుమతిచ్చినా టీడీపీ స్పందించలేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహంతోపాటి అల్లూరి విగ్రహ ఏర్పాటు చేయాలన్నారు.




