Monday, 23 November 2026

సీమాంధ్ర

భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రంలో ఓ భర్త అనుమానంతో భార్యపై కతితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఒక మహిళ గొంతుకోసి అతను పరారైయ్యాడు. భార్య, మరో మహిళ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.…

ఉగాది నుంచి హెల్త్‌ కార్డులు పంపిణి: మంత్రి కొండ్రు మురళి

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు ఉగాది కానుకగా హెల్త్‌ కార్డులను అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులను పంపీణి చేయనుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖా మంత్రి కొండ్రు మురళి తెలిపారు.

ఉగాది నుంచి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు:సీఎం కిరణ్‌

చిత్తూరు : తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి తక్కువ ధరకే నిత్యావసరవస్తువులను రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 7,390 కోట్లతో కార్యచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు…

ఆధార్‌ అనుసంధానంతో నగదు బదిలీకి సీఎం శ్రీకారం

చిత్తూరు: ఆధార్‌ అనుసంధానంతో తపాల ద్వారా సామాజిక భద్రత ఫించన్లు , ఉపాధిహామి పథక చెల్లింపుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌ మార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మాట్లాడారు.…

రాష్ట్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు

విశాఖ: రాష్ట్రంలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలను విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెంటచింతల, నిజామాబాద్‌, అనంతపురం, కడప, కర్నూలు -41 డిగ్రీలు నమోదు కాగా, మహబూబ్‌నగర్‌, హన్మకొండలో 40, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రామగుండంలో…

అట్టల ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి వద్ద అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

అప్పు చెల్లించలేదని కార్మికుడిని మూడు రోజులు పాటు నిర్భంధం

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో అమానుషం జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదని చేనేత కార్మికుడిని యజమాని మూడు రోజుల పాటు నిర్బంధించాడు. ఈ సంఘటన ఎర్రజోడు చేనేత ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకుని…

ఒంగోలు జడ్జి ఇంట్లో పని చేస్తున్న అటెండర్‌ హత్య

ఒంగోలు , మార్చి 25: జిల్లా న్యాయమూర్తి జీ చక్రధర్‌రావు ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. న్యాయమూర్తి ఇంట్లో అటెండర్లగా పనిచేస్తున్న చల్లా సాంబశివరావు (32), దొమ్మేటి వెంక…

4,700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : దేశంలోని 1.55లక్షల పోస్టాపీసులను 4700కోట్లతో ఆధునీకరించ నున్నట్లు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24కోట్లతో 220 పాఠశాలల్లో రాజీవ్‌గాంది ఐసీటి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఉద్యోగాల పేరుతో మోసంచేసిన వ్యక్తి అరెస్టు

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో ఉద్యోగాల పేరుతో చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలిప్పిస్తానని 40 మంది నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిన కిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి…