Monday, 23 November 2026

సీమాంధ్ర

రూ. 50 లక్షల నగదు పట్టివేత

ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 50 లక్షల నగదు పట్టుకున్నారు. ఆధారాలు సమర్పించి డబ్బు తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.

ఎస్‌ఈ కార్యాలయం ఎదుట బైఠాయించిన పయ్యావులు

అనంతపురం: తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అనంతపురం జిల్లా ఎస్‌ఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. హెచ్‌ఎల్‌సీ ద్వారా నీటి విడుదల కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. నీళ్లు ఇచ్చేవరకు తన నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

విశాఖ: మధురవాడ శివారులోని శంభువానిపాలెం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు యవకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు.

అది వారి వ్యక్తిగత విషయం : డీఎల్‌

కడప : ఎఫ్‌డీఐల విషయంలో తెదేపాకు చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం మంత్రి కూడా వ్యక్తిగత విషయమని మంత్రి డీఎల్‌ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా తెదేపా ఎంపీలతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు.…

విద్యార్థులు నేతలపై ఒత్తిడి తీసుకురావాలి : లగడపాటి

విజయవాడ : తెలంగాణ పై జరగనున్న అఖిలపక్ష భేటీలో సమైఖ్యాంధ్ర వాదన వినిపించే విధంగా నేతలపై విద్యార్థులు ఒత్తిడి తీసుకురావాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సమైఖ్యాంధ్ర జేఏసీ నిర్వహించిన సమావేశానికి లగడపాటి హాజరయ్యారు.…

ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

గుంటూరు: వెల్దుర్తి మండలం గుడిపాడు చెరువు వద్ద ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో మావోయిస్టులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.  వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు.

తెలుగు భాషా పరిరక్షణకు తానా కృషి :తోటకూర ప్రసాద్‌

గుంటూరు: ప్రవాసాంథ్రుల సంఘం తానా ఆధ్వర్యంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తానా అధ్యక్షులు తోటకూరప్రసాద్‌ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఈ నెల 22న ఖమ్మంలో జానపద కళోత్సవం,…

తెలుగు మహాసభల ప్రచార రథాన్ని ప్రారంభించిన : పార్థసారధి

విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ప్రచార రథాన్ని మాధ్యమిక విద్యాఖాఖ మంత్రి పార్థసారిధి విజయవాడలో ప్రారంభించారు. మహాసభలపై కృష్ణా జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన…

ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం

సుండుపల్లి: చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గన్నిమిట్లకు చెందిన గజ్జెల శ్రీనివాసులు రెడ్డి అనే ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం ప్రయోగిస్తూ కడప కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను కడప జిల్లాలో పలు ఎర్రచందనం…

మట్టిమిద్దె కూలి ఇద్దరి మృతి

కర్నూలు : పాములపాడు మండలం బానుముక్కలలో మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు. వర్షం నీటికి మిద్దె నాని కూలినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక విచారణ చేపట్టారు.